కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన ఓజీ మూవీ దుమ్మురేపుతోంది. అభిమానుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఈ సినిమాను సెలబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. వసూళ్ల గురించి అప్పుడే చర్చ కూడా మొదలైంది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ లో 3 మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఓవర్సీస్ లో దీని కలెక్షన్లపై అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓజీ విడుదలకు ముందు నార్త్ అమెరికాలో కొన్ని విషయాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అక్కడ ఓ పెద్ద నిర్మాణ సంస్థ దీని షోలు క్యాన్సిల్ చేయడం, మరో ప్రొడెక్షన్ హౌస్ దీన్ని తీసుకోవడం జరిగింది. దీంతో అక్కడ ప్రీమియర్స్ లో ఈ మూవీ ఎంత కలెక్షన్లు సాధించిందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. తాజాగా విదేశీ నిర్మాణ సంస్థ ప్రీమియర్స్ కలెక్షన్లపై అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.
నార్త్ అమెరికాలో ఓజీ ప్రీమియర్స్ లోనే 3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని తెలిపింది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకూ ఈ స్థాయిలో వసూల్లు రాలేదని తెలిపింది. కేవలం ప్రీమియర్స్ లోనే 3 మిలియన్లు సాధించడం కూడా ఇదే తొలిసారి అని నిర్మాణ సంస్థ వెల్లడించింది. భారత్ తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఓజీ పేరే వినిపిస్తోందని తెలిపింది.


