కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుదీర్ బాబు, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్నారు. అనంతరం నిమజ్జనం జరిగే మార్గాన్ని బస్సులో స్వయంగా పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులకు సూచనలు జారీ చేశారు. మండప నిర్వాహకులు అధికారులు మర్యాదపూర్వకంగా సత్కరించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


