కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ లోని పలు కాలనీలు నీటమునిగాయి. రాత్రికి రాత్రే అతి భారీ వర్షం కురవడంతో లోతట్టు కాలనీలు అన్ని వరద నీటితో మునిగాయి. రాత్రి కావడంతో పలు కాలనీ వాసులు వదరనీటిలోనే చిక్కుకున్నారు. ముఖ్యంగా వరంగల్ లోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురానగర్, శివనగర్, ఎన్టీఆర్ నగర్ లు వరద ముంపుకు గురయ్యాయి.
అతి భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తమైన వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కాలనీవాసులకు సూచిస్తున్నారు.
అత్యవసర సహాయార్ధం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీనంబర్లు వరంగల్ జిల్లా కలెక్టరేట్ 1800 425 3434, 9154225936 హనుమకొండ కలెక్టరేట్ 1800 425 1115, జిడబ్ల్యూ ఎంసీ 1800 425 1980, 9701999676, విద్యుత్ శాఖ 1800 425 0028 లకు సంప్రదించాలని అధికారులు తెలిపారు.


