శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ
కాకతీయ, కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.మహోత్సవంలో భాగంగా దేవస్థానం మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఐలయ్య దంపతులు ఉమారాణితో కలిసి, కుమారుడు శ్రీనివాస్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్‌కు పట్టువస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేదరి వీర ప్రతాప్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ మూడు మోహన్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం అభివృద్ధి, పండుగల నిర్వహణలో ఐలయ్య చూపుతున్న చొరవను ఆలయ కమిటీ కొనియాడింది.వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య జరిగిన కళ్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి కృప గ్రామ ప్రజలందరిపై ఉండాలని పెద్దలు ఆకాంక్షించారు.


