అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పణ
కాకతీయ,హనుమకొండ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రొట్ట దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు కట్ట నాగేష్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి మద్దెల రవికుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సలహాదారులు వెనమల్ల రమేష్, మూల వెంకటస్వామి, ఇబ్బని వెంకటస్వామి, జానపట్ల నికుంజన రావు, సుదమల్ల శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పసుల రాజ్ కుమార్‌తో పాటు కిన్నర నరేష్, దాసరి వీరేష్, జవాజి కిషన్, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


