ఆరోగ్యకర గొర్రెల పెంపకానికి నట్టల మందు
సర్పంచి తూర్పాటి శంకర్
కాకతీయ, నెల్లికుదురు : ఆరోగ్యవంతమైన గొర్రెలు, మేకల పెంపకానికి నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలని మేచరాజుపల్లి సర్పంచి తూర్పాటి శంకర్ పెంపకదారులకు సూచించారు. బుధవారం మండలంలోని మేచరాజుపల్లిలో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా సరఫరా చేసిన నట్టల మందును ఆయన గొర్రెలు, మేకలకు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట్టల కారణంగా జీవాలు అనారోగ్యానికి గురవుతాయని, ప్రభుత్వం అందిస్తున్న నివారణ మందును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ ఉపేందర్, మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, ఉమ్మడి వరంగల్ జిల్లా గొర్రెల పెంపకదారుల డైరెక్టర్ దూబర్ల సాయిలు, కోటగిరి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


