నుస్తులాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పరిశీలన
కాకతీయ, కరీంనగర్ : నుస్తులాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్ రావు శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం (గ్రౌండ్)ను సమతలంగా చేసి క్రీడాకారులు, విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ యువతకు వ్యాయామం, అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత క్రీడల్లో రాణించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, పాఠశాల మైదానం అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


