నెక్కొండలో ఎన్‌ఎస్‌వీ శిబిరం
11 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు….
కాకతీయ, నెక్కొండ: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం (ఎన్ ఎస్ వి) నిర్వహించారు. డాక్టర్ రాహేల తన్వీర్, డాక్టర్ సుమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 11 మంది పురుషులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి ప్రకాష్ హాజరై శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎన్‌ఎస్‌వీ సర్జన్ ఎ. శ్రీకృష్ణారావు, డాక్టర్ కె. విజయ్ కుమార్, పిఒఎంహెచ్‌ఎన్, అలంకాని పేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, డాక్టర్ రాహుల్ వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలని వైద్యులు సూచించారు. శిబిరంలో హెచ్‌ఎస్ వరమ్మ, హెల్త్ అసిస్టెంట్ రవిచందర్ రెడ్డి, స్టాఫ్ నర్స్ అర్చన, భాస్కర్, ల్యాబ్ టెక్నీషియన్ మల్లేశం, ఏఎన్‌ఎంలు సరిత, రజిత, స్వప్న, బాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


