epaper
Thursday, January 22, 2026
epaper

కేటీఆర్‌కు నోటీసులు

కేటీఆర్‌కు నోటీసులు

రేపు ఉదయం 11 గంటలకు విచారణ

ఇప్పటికే హరీశ్​రావును విచారించిన అధికారులు

త్వ‌ర‌లోనే కేసీఆర్‌కు పిలుపు?

తుది దశకు చేరుకుంటున్న ఫోన్​ ట్యాపింగ్ కేసు !

మ‌రింత దూకుడు పెంచిన సిట్‌

ఉత్కంఠ రేపుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు నార్సింగి ఆలీవ్​ విల్లాస్​లోని కేటీఆర్​ నివాసంలో సిట్​ అధికారులు సీఆర్​పీసీ 160 ప్రకారం నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించ‌గా అక్కడ నోటీసులు తీసుకోకపోవడంతో నందినగర్​లోని నివాసంలో అందించారు. కాగా.. ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం.. ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అటు హరీష్ రావును కూడా మరోసారి సిట్ విచారణకు పిలవవచ్చని సమాచారం. ఇదే కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా విచారించేందుకు నోటీసులు జారీ చేస్తారని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆరోపణలను తోసిపుచ్చిన కేటీఆర్

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పలుమార్లు కేటీఆర్ పేరు వినిపించింది. సినీ హీరోయిన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కేటీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆయనపై ఆరోపణలు వ‌చ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరోపణలు చేశారు. అయితే ఫార్ములా ఈ కారు రేసు కేసు మాదిరిగానే ఇదోక లొట్టపీసు కేసు అని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలలో భాగంగా సిట్ పేరుతో ఆడుతున్న డ్రామా అని ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. హరీష్ రావు ను సిట్ విచారణకు పిలిచిన సందర్భంలోనూ కేటీఆర్ ఇదే వాదనను వినిపించారు. ఇప్పుడు సిట్ తనను కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

నిలదీస్తున్నందుకే నోటీసులు : హరీష్ రావు

కేటీఆర్‌కు సిట్‌ నోటీసులపై హరీశ్‌రావు స్పందించారు. నిన్న తనకు నోటీసు, ఇవాళ కేటీఆర్‌కు నోటీసు ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల హామీలపై గట్టిగా నిలదీస్తున్నందుకే సిట్ విచారణ నోటీసులు జారీ చేసిందని హరీష్ రావు మండిప‌డ్డారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సిట్ నోటీసులు, విచారణ తంతులు అని హరీష్ రావు విమర్శించారు. ఎన్ని నోటీసులిచ్చినా, ఎన్ని కేసులు పెట్టిన మేం ప్రభుత్వాన్ని నిలదీస్తుంటామని, రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు భయపడబోమని, ఆయనను వదిలిపెట్టబోమని, వెంట పడుతామని హరీష్ రావు హెచ్చ‌రించారు. మీరు బలహీనులు కాబట్టే పోలీసులను ఆయుధాలుగా వాడుకుంటున్నారని, తాము ధైర్యవంతులం కనుక ప్రజల మధ్య నిటారుగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని హరీశ్​ రావు పేర్కొన్నారు. మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ సిద్ధమే అని అన్నారు. కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు చెప్పడానికి రేవంత్​ రెడ్డి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.

వేగం పెంచిన సిట్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్ హరీశ్‌రావును సిట్​ విచారణ చేసింది. దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారణ చేశారు. ఈ కేసు దర్యాప్తుతో సంబంధమున్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని సిట్​ అధికారులు ఆయనను ఆదేశించారు. ఈ కేసులో హరీశ్‌రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ ఆరోపణలపై 2024 మార్చి 10 నుంచి కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన అభియోగపత్రాలు సైతం దాఖలయ్యాయి. సిట్ ​ఏర్పాటయ్యాక దర్యాప్తులో మరింత వేగం పెరిగింది.

మండిప‌డిన బీఆర్ఎస్

కేటీఆర్​కు సిట్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ సర్కారు నాటకం ఆడుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి మండిపడ్డారు. పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చేస్తున్నారని ఆక్షేపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్​లగా దర్యాప్తు నడిపిస్తోందని అన్నారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకే సిట్‌ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారని బీఆర్​ఎస్​ నేత సోమభరత్​ విమర్శించారు. కోర్టులు, చట్టంపై నమ్మకం ఉన్నందున చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం పాడు పనులు చేస్తోందని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకపోవడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్‌ వేశారని ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌ సింగ్భూం అటవీ ప్రాంతంలో కాల్పుల మోత‌ 15 మంది మావోయిస్టులు...

అక్రమాస్తులు రూ. 100 కోట్లు!

అక్రమాస్తులు రూ. 100 కోట్లు! వెంకట్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ త‌నిఖీలు మొత్తం ఎనిమిది చోట్ల...

సింగరేణిలో బొగ్గు కుంభకోణం

సింగరేణిలో బొగ్గు కుంభకోణం సీబీఐతో ద‌ర్యాప్తు చేయిస్తే అనేక అక్ర‌మాలు వెలుగులోకి రేవంత్–బామ్మర్ది సృజన్...

నాన్న ప్రోత్సాహమే న‌డిపిస్తోంది : హర్షిత్ రాణా

నాన్న ప్రోత్సాహమే న‌డిపిస్తోంది : హర్షిత్ రాణా కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: టీమిండియా...

ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్!

ట్రాఫిక్‌కు ‘యువ ఐపీఎస్’ ట్రీట్మెంట్! నగర సమస్యల పరిష్కారానికి సీఎం కొత్త ప్రయోగం గ్రేటర్...

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక...

ఒక్క ఛాన్స్ ఇవ్వండి..

ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం మున్సిపాలిటీలకు నిధులు వ‌చ్చేలా...

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట మూడు మేయ‌ర్ ప‌ద‌వులు, 38 ఛైర్‌పర్సన్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img