కాకతీయ, బయ్యారం : మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ నరసింహారెడ్డి పరిశీలించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణ సంబంధిత విషయాలపై ఆర్ వో, తదితర అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జడ్పీ సీఈవో పురుషోత్తం, ఇంచార్జి ఎంపీడీవో దైవాధీనం, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


