కాకతీయ, మంథని : మంథని మండలంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరా అందుబాటులో ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న తెలిపారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ఆదివారం మంథనికి 100 మెట్రిక్ టన్నులు (2,250 బస్తాలు) యూరియా దిగుమతి అయిందని అయన తెలిపారు. మండలంలోని గ్రామాల్లో డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే సెంటర్ల ద్వారా రైతులకు పంపిణీ జరుగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు చూపిన రైతులకు మాత్రమే యూరియా అందజేస్తున్నట్లు తెలిపారు. దళారుల చేతుల్లోకి యూరియా వెళ్లకుండా, దుర్వినియోగం జరగకుండా అధికారుల పర్యవేక్షణలో సరఫరా కొనసాగుతున్నదని వెంకన్న తెలిపారు.


