epaper
Sunday, March 15, 2026
epaper

నిధుల్లేవు.. పనుల్లేవు..!

నిధుల్లేవు.. పనుల్లేవు..!
కరీంనగర్‌లో రెండేళ్లలో అభివృద్ధి శూన్యం
కేంద్రం–రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల నగరానికి నష్టం
బీఆర్ఎస్ హయాంలోనే అసలైన అభివృద్ధి
హామీలు అమలు కాక ప్రజల్లో అసంతృప్తి
మేయర్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ ఖాతాలోనే
క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్

కాకతీయ, కరీంనగర్ : గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్ నగర అభివృద్ధికి గణనీయమైన నిధులు తీసుకురాలేదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చెప్పుకునే పనులన్నీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన నిధులతోనే జరిగాయని, వాటినే ఇతర పార్టీలు తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని 9వ డివిజన్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో నగరానికి పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా ఒక్క రూపాయి కూడా తీసుకురాని పాలకులు, పాత పనులనే తమవిగా చెప్పుకోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్–బీజేపీ పాలనపై విమర్శలు

కాంగ్రెస్, బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని గంగుల వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో రాష్ట్రంతో పాటు కరీంనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి ఏమిటి? తీసుకొచ్చిన నిధులు ఎన్ని? అన్నదానిపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకావడం లేదని గంగుల కమలాకర్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించి పాలన సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన కాలంలో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నను లేవనెత్తారు. పాలకుల వైఫల్యాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.

మేయర్ పీఠంపై ధీమా

కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠం మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇస్తే నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి స్పష్టమైన విజన్ బీఆర్ఎస్‌కే ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, డివిజన్ అభ్యర్థి జంగిలి లత – ఐలెందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మనుషులకే కరెంట్ లేదు..!

మనుషులకే కరెంట్ లేదు..! మ‌హిళా ఏఈ వింత స‌మాధానం.. వివాదాస్ప‌ద‌మైన కాల్ రికార్డు వైర‌ల్ కాకతీయ, సిరిసిల్ల...

బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి

బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో...

బీఆర్ఎస్‌కు గుడ్‌బై

బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా...

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో...

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌ కాకతీయ, కరీంనగర్ : సంచార,...

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img