స్థానిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేదు
బీజేపీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి
కాకతీయ, ఆత్మకూరు : స్థానిక ఎన్నికల్లో ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై పోటీ చేస్తుందని వస్తున్నా వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి ఒక్క ప్రకటనలో తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఎవరితో పోటీపడేది లేదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే సత్తా లేదని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ ను దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసారు.


