కాకతీయ, కరీంనగర్ బ్యూరో: జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్‌గా రాచర్ల వేణు చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ల భద్రయ్య శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు భద్రయ్య మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేరేలా కమిటీ సేవలు కొనసాగించాన్నారు.
మీడియా ద్వారా మానవ హక్కులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణవ్‌తో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సభ్యులు పాల్గొన్నారు.


