పెద్దపల్లి కాంగ్రెస్కు కొత్త జోష్
58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు
టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆమోదం
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతిపాదనల ఆధారంగా నియామకాలు
ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలకు కీలక బాధ్యతలు
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ కార్యవర్గాన్ని విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి మొత్తం 58 మంది సభ్యులతో కూడిన జిల్లా కార్యవర్గాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ నియామకాలతో పార్టీ కార్యకలాపాలు గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా దీటి బాలరాజు, హనుమంతరెడ్డి, మారెల్లి రాజిరెడ్డి, ఎం.డి. మునీర్, అర్షనపెల్లి వెంకటేశ్వరరావు, చొప్పరి సదానందం బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్ సెక్రటరీలుగా ఇసంపెల్లి అంజుల్, సనా ఫక్రుద్దీన్, పూరడి సత్తయ్య గౌడ్, పర్శవేని శ్రీనివాస్, ఎండి అబ్దుల్ మోబిన్, దేవరకొండ రాజు, కొమ్ము శ్రీనివాస్, కసిరెడ్డి మహేందర్ రెడ్డి, గంగిరెడ్డి తిరుపతి రెడ్డి, నర్సింగ రావు, తోట చంద్రయ్య, సూర సమ్మయ్యలకు బాధ్యతలు అప్పగించారు.
ఇతర నియామకాలు
కోశాధికారిగా చిదురాల రవీందర్ నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా పెండ్యాల మహేష్, బైరి రవి గౌడ్, సగ్గెం రాజేష్, మోహిద్ సన్ని ఎంపికయ్యారు. జిల్లా కార్యదర్శులుగా గాదె సుధాకర్, వాసుదేవరావు, అనుమ సత్యనారాయణ, కరెంగల రమేష్, తిర్తల వీరయ్య, రవి సదానందం, ఎర్ర రాజిరెడ్డి, పూరడి రాజేందర్ గౌడ్, పి. శంకర్, కొత్త నర్సింహం, ఇల్లి శ్రీనివాస్, చంద్రమౌళి, బుద్దర్తి బుచ్చయ్య, గాండ్ల మోహన్, కటకం రవీందర్, ఇస్తికర్లకు స్థానాలు కల్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీనివాస్, సుతారపు పరమేష్, మిట్టపల్లి శ్రీకాంత్, శ్రీకొండ కొమురయ్య, కవ్వంపల్లి స్వామి, మాదాసు సతీష్, చెరుకు బుచ్చి రెడ్డి, చుక్కల శ్రీనివాస్, ఎండి హమీద్, బొడిగె భరత్ గౌడ్, కొత్తపల్లి రాజు, మంచినీళ్ల భాస్కర్, మద్దుపు మధు, నేరెడ్ల ఓదెలు, తాళ్లపల్లి కుమార్, కటకం సత్యం, కుందారపు బాపు, సవ్వ శంకర్, నాగెల్లి జానీలకు చోటు కల్పించారు.
పార్టీ బలోపేతానికి దోహదం
ఈ నియామకాలతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఈ కార్యవర్గం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించి పార్టీని మరింత బలపరుస్తారని ఆశిస్తున్నారు.


