కమిషనరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు
కేక్ కట్ చేసిన సీపీ గౌష్ ఆలం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొని అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2026 సంవత్సరం పోలీస్ కుటుంబాలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణలో గతేడాది అంకితభావంతో పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితర అధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బంది పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


