epaper
Monday, March 2, 2026
epaper

ఎన్‌ఐటి లో కొత్త రికార్డు..

ఎన్‌ఐటి లో కొత్త రికార్డు..

దేశీయంగా రూ. 1.27 కోట్ల అత్యధిక ప్యాకేజీ..

ప్లేస్‌మెంట్ సీజన్‌ 2025–26 ప్రారంభ దశలోనే అద్భుత ఫలితాలు..

కాకతీయ, వరంగల్‌ బ్యూరో : దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఎన్‌ఐటి వరంగల్ మరోసారి తన ప్రతిభను నిరూపించింది. ప్లేస్‌మెంట్ సీజన్‌ 2025–26 ప్రారంభ దశలోనే అత్యధిక దేశీయ ప్యాకేజీ రూ. 1.27 కోట్లు రికార్డు నమోదైంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బి.టెక్ విద్యార్థి నారాయణ త్యాగి ఒక ప్రముఖ బహుళజాతి సంస్థ నుంచి రూ. 1.27 కోట్ల సీటీసీతో ఆఫర్‌ అందుకున్నారు. ఇది ఎన్‌ఐటి వరంగల్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక దేశీయ ప్యాకేజీగా నిలిచింది. అదే సమయంలో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ. 1.0 కోటి సీటీసీతో మరో దేశీయ ఆఫర్‌ సాధించారు. ఈ ఘనతలు ఎన్‌ఐటి వరంగల్‌ విద్యా ప్రమాణాలు, పరిశ్రమలతో ఉన్న బలమైన బంధాలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్లేస్‌మెంట్ సీజన్‌ ప్రారంభ రెండు నెలల్లోనే వివిధ విభాగాల విద్యార్థులు విశేష అవకాశాలను అంది పుచ్చుకున్నారు.

రెండు నెలల్లోనే రికార్డు స్థాయి ప్యాకేజీలు..

రూ. 70 లక్షలకు పైగా సీటీసీతో 6 మంది విద్యార్థులు ఆఫర్లు పొందారు. రూ. 50 లక్షలకు పైగా సీటీసీతో 34 మంది విద్యార్థులు, రూ. 30 లక్షలకు పైగా సీటీసీతో 125 మంది విద్యార్థులు, రూ. 25 లక్షలకు పైగా సీటీసీతో 163 మంది విద్యార్థులు, రూ. 20 లక్షలకు పైగా సీటీసీతో 200 మందికి పైగా విద్యార్థులు, సగటు ప్యాకేజీ రూ. 26 లక్షలు దాటింది అని తెలిపారు. ప్లేస్‌మెంట్ సీజన్‌ ఇంకా కొనసాగుతుండగా, అనేక ప్రముఖ సంస్థలు త్వరలో క్యాంపస్‌ను సందర్శించనున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే నెలల్లో మరిన్ని అధిక విలువ గల ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఎన్‌ఐటి వరంగల్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి మాట్లాడుతూ.. మా విద్యార్థుల ప్రతిభ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, మా సంస్థపై రిక్రూటర్ల నమ్మకాన్ని ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి, అని అభినందనలు తెలిపారు. అలాగే, ఈ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి సి పి డి ) బృందానికి, దాని హెడ్ ప్రొఫెసర్ పి.వి. సురేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌ఐటి వరంగల్‌లో రాబోయే నెలల్లో మరిన్ని రికార్డు స్థాయి ప్లేస్‌ మెంట్‌లు నమోదయ్యే అవకాశముందని సంస్థ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img