అందుబాటులోకి నూతన మార్కెట్
ప్రారంభించిన మంత్రి వివేక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : వీధి వ్యాపారస్తుల సౌకర్యార్థం నూతన కూరగాయల మార్కెట్ (షెడ్) లను అందుబాటులోకి తెచ్చినట్లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. సుమారు 15 లక్షల రూపాయల నిధులతో రాజీవ్ చౌక్ వద్ద నూతనంగా నిర్మాణం చేసిన మార్కెట్ ప్రాంగణాన్ని శనివారం మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కాగా ఐదు వందల రూపాయల కూరగాయలను మంత్రి కొనుగోలు చేశారు. ఈ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,డిసిసి అధ్యక్షుడు రఘునాథ రెడ్డి,పల్లె రాజు,వోడ్నాల శ్రీనివాస్,గాండ్ల సమ్మయ్య,యాకుబ్ అలీ,రాజయ్య,సాగర్ రెడ్డి,ఎర్రబెల్లి రాజేష్ – ప్రేమలత,జంగం కళ,పార్వతి విజయ తదితరులు పాల్గొన్నారు.


