కరీంనగర్ మహిళా కాంగ్రెస్‌లో కొత్త వెలుగు
సంఘటిత శక్తిగా మహిళా కాంగ్రెస్. వెన్నం రజిత రెడ్డి
కాకతీయ,కరీంనగర్ : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆదేశాలతో, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి అనుమతితో, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో నగర మహిళా కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ల నియామక కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నం రజిత రెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి డివిజన్ కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళా కార్యకర్తలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.


