హుజురాబాద్ బార్‌కు కొత్త నాయకత్వం
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేసరి శేషయ్య
కాకతీయ, హుజురాబాద్ : బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్త కార్యవర్గాన్ని న్యాయవాదులు ఎన్నుకున్నారు. 2026-27 సంవత్సరానికి ఎన్నికలు గురువారం నిర్వహించారు. మొత్తం 125 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించారు. ఎన్నికల అధికారులు జోజుల ప్రవీణ్ కుమార్, గురాల వెంకట్ కుమార్, బాగోతు కుమారస్వామి ఫలితాలను ప్రకటించారు. అధ్యక్షుడిగా కేసరి శేషయ్య 63 ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి శంకర్ కనుకుంట్లపై గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా పాక జ్యోత్స్న దేవి 85 ఓట్లతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా రాజేష్ పిట్టాల 84 ఓట్లు సాధించారు. జాయింట్ సెక్రటరీగా యెంగాల లింగమూర్తి 47 ఓట్లు పొందారు. క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా మోరే కళ్యాణ్ 74 ఓట్లు సాధించారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా యాస్మిన్ 66 ఓట్లు పొందారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని తెలిపారు. నూతన కార్యవర్గాన్ని న్యాయవాదులు అభినందించారు.


