కొత్త జీపీ భవనం ప్రారంభం
మూడు నెలల్లోనే వేగంగా నిర్మాణం పూర్తి
సర్పంచ్ రడం భరత్ కుమార్‌కు గ్రామస్తుల అభినందనలు
కాకతీయ, గీసుగొండ : సర్పంచ్‌గా గెలుపొందిన మూడు నెలల్లోనే నూతన గ్రామపంచాయితీ భవనాన్ని నిర్మించి ప్రారంభించిన సర్పంచ్ రడం భరత్ కుమార్. మండలంలోని రాంపూర్ గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాత గ్రామ పంచాయితీ భవనాన్ని పడగొట్టి జనవరి 6న నూతన భవనానికి ముగ్గుపోసి నిర్మాణ పనులు చేపట్టారు. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి 6-4-2026న నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టు నెలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.20 లక్షలతో మంజూరైన ఈ గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ బాధ్యతలు స్వీకరించిన రడం భరత్ కుమార్ వేగంగా పనులు పూర్తి చేసి భవనాన్ని ప్రజలకు అందుబాటు లోకి తీసుకువచ్చారు. అనతి కాలంలోనే నూతన గ్రామ పంచాయితీ భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి సర్పంచ్ రడం భరత్ కుమార్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు అల్లం స్వప్న, అల్లం మర్రెడ్డి, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్,మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్,రాంపూర్ గ్రామ ఉప సర్పంచ్ పులి సూరయ్య, వార్డు సభ్యులు నారాయణ, రచన, సునీత,లక్ష్మీ,శీను, సుశీల,యశోద, వివిధ గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


