కాకతీయ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో పాస్టర్స్ ఫెలోషిప్ మండల నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోళ్ళ ప్రభుదాస్, వైస్ ప్రెసిడెంట్ బంటు ప్రభుచరణ్, ట్రెజరర్ ఏర్పుల మోషే,సెక్రటరీగా సతీష్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు ప్రభుదాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతను అప్పజెప్పినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని పాస్టర్లు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.


