ఇనుగుర్తి రెడ్డి సేవా సంఘానికి నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యాకూబ్ రెడ్డి
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల రెడ్డి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని గంజి రామ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శనివారం నిర్వహించిన సంఘం 14వ వార్షిక సమావేశంలో 2026–28 కాలానికి కొత్త కమిటీని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియను గంజి జనార్ధన్ రెడ్డి, బొబ్బిలి మల్లారెడ్డి (టీచర్) ఎన్నికల అధికారులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి మహేందర్ రెడ్డిని మండల అధ్యక్షుడిగా, అనుమాండ్ల యాకుబ్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా కొడకండ్ల నరేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా అనుమాండ్ల కృష్ణ రెడ్డి, కోశాధికారిగా పరిపాటి వెంకట రెడ్డి నియమితులయ్యారు. ముఖ్య సలహాదారులుగా పరిపాటి సంజీవ రెడ్డి, మాడుగుల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.


