నేతాజీని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
బీజేపీ 62వ డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్ యాదవ్
కాకతీయ, కాజీపేట : భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకొని సోమిడిలో ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ 62వ డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్ యాదవ్ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ యాదవ్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య సమరంలో నేతాజీ భారత సైనికులకు గెరిల్లా యుద్ధ విన్యాసాలు నేర్పించి బ్రిటిష్ పాలకులను ఎదుర్కొన్న ధీరుడని కొనియాడారు. నేతాజీ చూపిన దేశభక్తి, త్యాగ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సుంచు ప్రశాంత్, గిరి తిరుపతి, సంతోష్, గోపాల్, భరత్, ప్రభు కుమార్, యువజన సంఘ నాయకులు ఓంకార్, కరుణాకర్ రెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాస్, రాహుల్, రాజు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


