బ్లాక్ అవుట్ ఫిట్‌లో నేహా అందాలు అదరహో..
కాకతయ, సినిమా డెస్క్ : ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం సందర్భంతో పనిలేకుండా తమకు నచ్చినప్పుడు నచ్చిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సండే స్పెషల్ అంటూ ప్రముఖ బ్యూటీ నేహా శర్మ తన అందాలు ఆరబోస్తూ బ్లాక్ డ్రెస్ లో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రకరకాల ఫోజులతో కుర్రకారులో హీట్ పుట్టించిందని చెప్పవచ్చు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. మొత్తానికి నేహా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 2007లో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి పరిచయంలో వచ్చిన ‘చిరుత’ సినిమాతోనే నేహ కూడా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.


