కన్నాయిగూడెంలో ఎన్డీఆర్ఎఫ్ సాహసం
వాగులో చిక్కుకున్న ఏడుగురిని రక్షించిన సిబ్బంది
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కన్నాయిగూడెంలో జరిగిన సాహసోపేత రక్షణ చర్యలో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు కలిసి ఏడుగురు కాపరులను సురక్షితంగా కాపాడారు. స్థానిక తెలిపిన వివరాల ప్రకారం దేవా, మనోజ్, దివ్య, లక్ష్మి, అడుమమ్మ, సంజీవ, నరేశ్ అనే కాపరులు పశువులను కాస్తూ సమీపంలోని హనుమంతుల వాగు దాటి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా వాగు ఉద్ధృతి పెరగడంతో అవతల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెస్క్యూ బృందం స్పీడ్ బోట్ తో సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి, సురక్షితంగా వారిని అవతలికి తీసుకువచ్చింది.స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసుల చాకచక్యానికి ప్రశంసలు కురిపించారు.


