కాకతీయ, హనుమకొండ : మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా శుక్రవారం ఓగ్లాపూర్‌లోని డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బలుగు లక్ష్మీ నివాసం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనేవారు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ శారీరక వ్యాయామం, నడక, పరుగును అలవాటు చేసుకోవాలన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తిగా క్రీడల్లో రాణించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బి. శోభారాణి, దయ్యాల రాకేష్ భాను, దయ్యాల దినేష్ చందర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు బి. రాజ్ కుమార్, ఎం. తిరుపతి రెడ్డి, టి. శ్రీనివాస్, బి. సునీత, గౌతమి తదితరులు పాల్గొన్నారు.


