epaper
Sunday, March 1, 2026
epaper

నాడు దేశసేవ… నేడు ప్రజాసేవ

నాడు దేశసేవ… నేడు ప్రజాసేవ
ఆత్మ‌కూరు స‌ర్పంచ్ మ‌శేశ్వ‌రి రాజుకు రేవూరి అభినంద‌న‌లు
గ్రామాభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేయాల‌ని పిలుపు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపు

కాకతీయ, ఆత్మకూరు : నాడు దేశసేవలో అంకితభావంతో పనిచేసి, నేడు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని ఆత్మ‌కూరు స‌ర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరి రాజు ను ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి కొనియాడారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, వార్డు సభ్యులను సన్మానించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్న నాయకుడిగా పర్వతగిరి మహేశ్వరి రాజు నిలిచారని ఎమ్మెల్యే కొనియాడారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. పర్వతగిరి మహేశ్వరిని ఎంపీటీసీగా, పర్వతగిరి రాజును సర్పంచ్‌గా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలే, ఇప్పుడు మరోసారి సర్పంచ్‌గా గెలిపించారని పేర్కొంటూ ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ కక్షలు తగవు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆనాడు పర్వతగిరి రాజుపై ఎస్సీ, ఎస్టీ వంటి తప్పుడు కేసులు పెట్టి పదవి నుంచి తొలగించిన విషయం ఆత్మకూరు ప్రజలకు తెలుసన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఓటమి భయంతోనే అలాంటి మాటలు మాట్లాడారని తీవ్రంగా విమర్శించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏ ముఖంతో ఆత్మకూరుకు వస్తారని ప్రశ్నించారు. ఆత్మకూరు గ్రామపంచాయితీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని సూచించారు. నిజాయితీపరులకే ఓట్లు వేస్తేనే గ్రామాలు, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కొందరు నోట్లకు ఓట్లు అమ్ముకోవడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిజాయితీగా పనిచేసే నాయకులకే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, ఆత్మకూరు ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శ్వేత, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భీరం సునంద సుధాకర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదాసి శ్రీధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కమలాపురం రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వడ్డేపల్లి ప్రసాద్, అలువాల రవి, హౌస్‌బూజుర్గ్ సర్పంచ్ సయ్యద్ మౌల, చౌళ్లపల్లి మాజీ సర్పంచ్ కంచె రవికుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img