పోలీసు శిక్షణ కళాశాలలో జాతీయ గీతాలాపన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వందేమాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం రోజున పోలీసు శిక్షణ కళాశాల లో శ్రీ భకీంచంద్ర చటర్జీ చిత్రపటానికి ప్రిన్సిపాల్ , కే.రమేష్ పుష్పాంజలి అర్పించి, సామూహిక జాతీయ గీతాలాపనచేశారు. తదనంతరం ప్రిన్సిపాల్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 7 నవంబర్ 1875 వ సంవత్సరంలో భకీంచంద్ర చటర్జీ రచించిన వందేమాతరం జాతీయ గీతం గుర్తింపు పొంది నేటికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశ ప్రజలందరం సామూహికంగా గీతాలాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. జాతీయ సమైక్యత కోసం,దేశభక్తి పెంపొందించటానికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎస్పిలు, శ్రీ విజయ్,సోమాని, భిక్షపతి, వెంకటేశ్వర రావు, డాక్టర్ సుధీర్, రాంమూర్తి, ఆర్ ఎస్ ఐ, అనిల్,రాజేష్, యుగంధర్, దశరథ్, ఏ ఎల్ ఐ శ్రీమతి షర్మిల, రాధిక, సి సి, సుమన్,రామాంజనేయరెడ్డి, పి ఆర్ ఓ రామాచారి, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు


