నరేష్ వేధింపులతోనే దీప్తి ఆత్మహత్య
చనువుగా ఉన్న ఫొటోలను ఫ్రెండ్స్‌కు షేర్
బ్లాక్ మెయిల్ చేయడంతో మనోవేదనకు గురైన గిరిజన యువతి
పురుగుల మందుతాగి ఆత్మహత్య :పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి
కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకతీయ, కారేపల్లి: గిరిజన యువతి ఆత్మహత్యకు కారణమైన నరేష్‌ను వెంటనే కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గేట్ రేలకాయలపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతి జరపల దీప్తిని ఆర్ఎంపీగా పనిచేస్తున్న నామ నరేష్ ప్రేమ పేరుతో వంచించాడని పేర్కొంది. అమ్మాయిని మోసం చేసి చనువుగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ మానసిక వేధింపులకు గురి చేశాడని జానకి ఆరోపించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దీప్తి జీవితంతో చెలగాటం ఆడుకున్నాడనీ, అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న ఫోటోలను తన ఫ్రెండ్స్ కు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడంతో ఆవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. దీప్తి ఆత్మహత్యకు బాధ్యుడైన నామా నరేష్ ను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాస్టిక్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబానికి తల్లిదండ్రులకు ప్రభుత్వం ద్వారా తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


