అల్లం రవికుమార్ కి నంది అవార్డు
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల కిష్టాపురం గ్రామ వాసి అల్లం రవికుమార్ నంది అవార్డును అందుకున్నారు. రుద్రా బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉత్తమ డివోషనల్ సింగర్ అవార్డు అల్లం రవికుమార్ కి ఇచ్చారు. హనుమాన్ చాలీసా, అయ్యప్ప, అమ్మవారి భజనలు, మణిద్వీప వర్ణనలాంటి హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ తన గానంతో మండల ప్రజల అభినందనలు మన్ననలు పొందుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అల్లం రవికుమార్ సంపాదించాడు. ఈ సేవలకు గుర్తింపుగానే హైదరాబాద్ అమీర్ పేట సత్యసాయి మేఘన ఆడిటోరియం నందు ప్రముఖ టీవీ, సినిమా యాక్టర్ సలీం, అడిషనల్ ఎస్పీ తేజావత్ రామదాసు చేతుల మీదుగా నంది అవార్డు అందించారు. ఈ సందర్భంగా మండల ప్రజలు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.


