ఢిల్లీ ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు నాగపురి రైతులు
కాకతీయ, చేర్యాల : రైతు ఉత్పత్తి దారుల సంస్థ (ఎఫ్ పి సీ), ఎస్ఎఫ్ఏసీ మరియు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాగపురి రైతు సేవ ఎఫ్ పి సి కి తెలంగాణ రాష్ట్రం నుండి ఉత్తమ రైతు సంఘం ఎఫ్ పి సి గా గుర్తించి చైర్మన్ జక్కుల తిరుపతి, వైస్ చైర్మన్ గురువారెడ్డి, కార్యదర్శి బండకింది బాపురాజు, డైరెక్టర్లు చెప్యాల గణేష్, మరియు డైరెక్టర్ రవి కుమార్ కి ఢిల్లీలో నిర్వహిస్తున్న 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో పాల్గొనటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆహ్వానం రావడం జరిగింది.ఉత్తమ రైతు సంఘంగా ఏర్పడడానికి సహకరించిన తోటి డైరెక్టర్లకు, రైతులకు, ఏకలవ్య ఫౌండేషన్కు ,ఎస్ఎఫ్ఏసీ వారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం నుండి రైతుల విభాగంలో కేవలం ఐదు మందికి మాత్రమే ఈ అవకాశం లభించింది.


