జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నాగేశ్వర్ రావు ట్యూషన్స్ ప్రభంజనం
హన్మకొండలో అద్భుత ప్రతిభ చాటిన విద్యార్థులు
కాకతీయ, హనుమకొండ: జేఈఈ మెయిన్స్–2026 ఫలితాల్లో హన్మకొండలోని నాగేశ్వర్ రావు ట్యూషన్ సెంటర్ విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరిచి సంస్థకు కీర్తి తీసుకొచ్చారు. అత్యుత్తమ శాతాలు సాధిస్తూ పలువురు విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ట్యూషన్ సెంటర్ డైరెక్టర్లు శివ నాగేశ్వర్ రావు, నరసింహా రావు మాట్లాడుతూ విద్యార్థుల కృషి, అధ్యాపకుల అనుభవజ్ఞులైన మార్గదర్శకత్వం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన బోధన, ప్రతిరోజూ నిర్వహించిన గ్రాండ్ టెస్టులు, నిరంతర మూల్యాంకనం, వ్యక్తిగత శ్రద్ధ, క్రమమైన మానిటరింగ్ ద్వారా విద్యార్థులను విజయపథంలో నడిపించామని పేర్కొన్నారు. ఫలితాల్లో ఎం. రామ్ చరణ్ 99.8 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవగా, జి. దినేష్ 99.718 శాతం, వై. సాత్విక 99.65 శాతం, పి. సహస్ర రెడ్డి 99.50 శాతం, బి. అభిజిత్ 98.44 శాతం సాధించి మెరుగైన ర్యాంకులు పొందారు. ఈ విజయాలు సంస్థ బోధన నాణ్యతకు నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల అద్భుత ఫలితాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలా సంస్థ మరింత కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు


