epaper
Monday, January 19, 2026
epaper

చిక్కుల్లో నాగ‌రాజు

చిక్కుల్లో నాగ‌రాజు
వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యేపై జ‌నాగ్ర‌హం
నిత్య‌కృత్యంగా మారుతున్న నిల‌దీత‌లు, నిర‌స‌న‌లు
హామీల అమ‌లుపై అడుగ‌డుగునా ప్రశ్న‌లు
సొంత పార్టీ నేత‌ల నుంచీ స‌హాయ నిరాక‌ర‌ణ‌
నియోజ‌క‌ర్గంలోనూ స్వేచ్ఛ‌గా తిరగలేని ప‌రిస్థితులు
వివాదాస్ప‌దంగా మారుతున్న ఎమ్మెల్యే నిర్ణ‌యాలు
రానున్న రోజుల్లో అధికార పార్టీకి తీవ్ర న‌ష్టం ?
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారుతున్న వ‌ర్ధ‌న్న‌పేట రాజ‌కీయం

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజుకు నిల‌దీత‌లు, నిర‌స‌న‌లు నిత్య‌కృత్యంగా మారాయి. అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతుండంతో సొంత నియోజ‌క‌ర్గంలోనూ స్వేచ్ఛ‌గా తిరుగ‌లేని ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. హామీల అమలులో విఫ‌ల‌మ‌మ‌తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తోపాటు ఎమ్మెల్యే తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు ఇటీవ‌ల వివాదాస్ప‌దంగా మారుతుండ‌టంతో విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా మ‌హిళ‌లు, రైతులు, యువకుల నుంచే గాక సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా నిర‌స‌న‌లు వెంటాడుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అమలుకాని సంక్షేమ పథకాలు, హామీల ఎగవేతపై రోజుకో చోట ప్రజలు ప్రశ్నలను సంధిస్తూ సమస్యలను ఏకరువు పెడుతుండటం కలవరపెడుతున్నది. నిరసన గళం రోజురోజుకూ తారస్థాయికి చేరుతుండ‌టంతో ఎమ్మెల్యే నాగ‌రాజు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యే నాగ‌రాజుపై ఉన్న వ్య‌తిరేక‌త రానున్న రోజుల్లో అధికార పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించే ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ వ‌రుస ప‌రిణామాలు వ‌చ్చే మున్సిప‌ల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌పైనా ప‌డే అవ‌కాశం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి

ఎమ్మెల్యే నాగ‌రాజుకు ఇటీవ‌ల వ‌రుస‌గా నిర‌స‌న సెగ తాకుతోంది. రెండు నెల‌ల కింద ఇండ్లు, గ్యాస్‌ సబ్సిడీ, రుణమాఫీపై ఐన‌వోలులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును స్థానికులు ప్రశ్నించడంతో అసహనంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. వరంగల్ జిల్లా ఏనుమాముల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన నాగరాజును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. గెలిచినప్పటి నుండి గ్రామానికి నిధులు కేటాయించలేదని, అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభించడానికే తాను వచ్చానని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ వారు శాంతించ‌క‌పోవ‌డంతో చేసేదేంలేక గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని 14 డివిజన్ ప‌ర్య‌ట‌న‌ను మ‌ధ్య‌లోనే ముగించి వెళ్లిపోయారు. అదేవిధంగా ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును మహిళలు నిలదీశారు. పింఛన్లు రావడంలేదని, ఇండ్ల మంజూరులో పారదర్శకత లోపించిందని, గ్యాస్‌ కనెక్షన్‌ల సబ్సిడీలు అందలేదని, రుణమాఫీ రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నాయకులు, కార్యకర్తలను పట్టించుకోరా ?

ఐనవోలు మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, టెస్కాబ్‌ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు హాజరయ్యారు. మండలవ్యాప్తంగా 470 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, 336 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. ఐనవోలులో 60 మంది లబ్ధిదారుల్లో 37 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. కాగా ఐనవోలుకు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సమావేశం ముగించుకొని వెళ్తున్న ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులకు కాకుండా పక్కా ఇండ్లు, భూములు, ఆస్తులున్న వారి పేర్లు ఇండ్ల జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం రీ సర్వే చేయించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.

ద‌వాఖాన త‌ర‌లింపుపై ఆగ్ర‌హం

తాజాగా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రి కూడా ఎమ్మెల్యేల‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చి పెట్టింది. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోనే ద‌వాఖాన నిర్మించాలంటూ ఆస్పత్రి సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 100 పడకల ఆస్పత్రిని పట్టణంలోనే నిర్మించడం అత్యవసరమని.. మ‌రోప్రాంతానికి త‌ర‌లించాల‌నే ఆలోచ‌న మానుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈక్ర‌మంలోనే తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం ర‌సాభాస‌గా ముగిసింది. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే నాగరాజు హాజ‌రుకాగా.. మహిళలు నిల‌దీశారు. వర్ధన్నపేటలో ఏం అభివృద్ధి చేశారని, ఉన్న ఆస్పత్రిని వేరే దగ్గరకు తరలించడం ఏంటని ప్ర‌శ్నించ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌ర్గంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉపాధ్యాయ బోధనలకు ప్రశంసలు

ఉపాధ్యాయ బోధనలకు ప్రశంసలు నెల్లికుదురు టీజీఎంఎస్‌లో ప్యానల్ తనిఖీ ఆధునిక బోధన, పరిపాలనపై పూర్తి...

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాన‌ని హామీ కాకతీయ, గీసుగొండ...

యువతలో మార్పే ప్రమాదాలకు మందు

యువతలో మార్పే ప్రమాదాలకు మందు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దు రోడ్డు భద్రతపై ప్రతి...

మహిళల భద్రతకు చట్టమే కవచం

మహిళల భద్రతకు చట్టమే కవచం ధైర్యంగా ఫిర్యాదు చేయాలి పోష్ యాక్ట్‌ను...

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ...

గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం

గ్రామాభివృద్ధికి పక్కా ప్రణాళిక అవసరం పారదర్శక పాలనతోనే ఆదర్శ గ్రామాలు నూతన సర్పంచులకు శిక్షణలో...

ప్రజా గొంతుకగా కాకతీయ ప‌త్రిక : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ప్రజా గొంతుకగా కాకతీయ ప‌త్రిక : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, తొర్రూరు...

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాక‌తీయ‌, మ‌రిపెడ : మరిపెడ మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img