కాకతీయ, సినిమా, 2025 అక్టోబర్ 25: ప్రశాంత్ నీల్.. ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. 2014లో ` ఉగ్రం` సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీకి ఆయన పరిచయమయ్యారు. ఈ చిత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన ` కేజీఎఫ్` ఆయన కెరీర్ దిశనే మార్చేసింది. 2018లో విడుదలైన కేజీఎఫ్: చాప్టర్ 1 భారత సినిమా రంగాన్ని షేక్ చేసింది. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ప్రశాంత్ నీల్ కన్నడను పాన్ ఇండియా మ్యాప్‌పై ఉంచిన దర్శకుడుగా నిలిచాడు. 2022లో వచ్చిన కేజీఎఫ్ 2తో ఆయన రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ బ్లాక్ బస్టర్స్ జాబితాలో నిలిచింది.
తర్వాత ప్రభాస్‌తో చేసిన సలార్ కూడా ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ అనే పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉండగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ప్రశాంత్ నీల్ సినిమాలు గమనించినవారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సినిమాలు ఎక్కువగా నలుపు రంగు షేడ్స్‌తోనే నిండిపోతాయి. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్, ఇప్పుడు వస్తోన్న డ్రాగన్ వరకు అన్నీ అదే టోన్‌లో ఉంటాయి.
ఇదే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా ఎక్కువగా నలుపు దుస్తులనే ధరించడం ఇష్టపడతారు. ఒకసారి దీనిపై ఆయన మాట్లాడుతూ, “నాకు బ్లాక్ కలర్ అంటే ఓసీడీ లాంటిది. ఆ కలర్‌లోనే కంఫర్ట్‌గా ఉంటాను,” అని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ప్రశాంత్ నీల్ తాజాగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈసారి ఆయన బ్లాక్ కాకుండా తెల్లని పట్టు దుస్తులు ధరించి హాజరయ్యారు. ఆయన భార్య లిఖితా నీల్ ఆ సన్నివేశాన్ని వెంటనే కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకి “ఫైనల్‌గా నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేసుకున్నాడు!” అంటూ క్రేజీగా క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో లిఖితా పోస్ట్ మరియు ఆమె పెట్టిన క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్తను దొంగ మొగుడు అనడం పట్ల కొందరు నెటిజన్లు షాక్ అవుతుండంగా.. మరికొందరు తెల్ల దుస్తుల్లో ప్రశాంత్ నీల్ స్టైల్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


