epaper
Thursday, January 15, 2026
epaper

నా క్యాడర్ మొత్తం నా వెంటే ఉంది

నా క్యాడర్ మొత్తం నా వెంటే ఉంది
తేనీటి విందు రాజకీయాలతో మాకేమీ నష్టం లేదు
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మంత్రి సురేఖ‌ పరోక్ష విమర్శలు
మంత్రి వ్యాఖ్యలతో మరోసారి బయటపడ్డ కాంగ్రెస్‌ వర్గపోరు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌ తూర్పులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన అనుచరులను తమ వైపు తిప్పుకుంటున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బలహీనులు బలవంతుల వెనుక పడతారని, మేము బలవంతులం కాబట్టే మమ్మల్ని ఎదుర్కోలేక మా వెనుక గోతులు తవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయాల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని, తన క్యాడర్ మొత్తం తన వెంటే ఉందని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో చిన్నచిన్న రాజకీయాలను తాను పట్టించుకోనని తెలిపారు.

అభివృద్ధిపై మంత్రి హామీలు

తూర్పు నియోజకవర్గ అభివృద్ధి విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఎల్–1 కేటగిరీలో అర్హులైన వారికి ఇప్పటికే ఇండ్లు కేటాయించామని, కొందరి పేర్లు పెండింగ్‌లో ఉండటంతో రీవెరిఫికేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థలాలు ఉన్నవారికీ, ఇండ్లు లేని నిరుపేదలకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. స్థలం లేని వారికి రెండు పడక గదుల గృహాలు కేటాయిస్తామని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 2,200 ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా యూజీడీ, ఐడీఓసీ, సమీకృత పాఠశాలల పనులను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ.200 కోట్లతో నియోజకవర్గానికి కేటాయించిన రెసిడెన్షియల్‌ స్కూల్‌ కోసం వర్ధన్నపేట పరిధిలో స్థలాన్ని ఎన్‌ఓసీ ద్వారా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారని, ప్రస్తుతం టెండర్‌ దశలో ఉందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.15 వేల చొప్పున త్వరలో ఆర్థిక సహాయం అందిస్తామని, దీనికి తహసీల్దార్ల ద్వారా జాబితాలు సిద్ధమవుతున్నాయని మంత్రి వెల్లడించారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నియోజకవర్గంలోని 32వ డివిజన్ కరీమాబాద్‌లో సైడ్‌ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే కాశీకుంట, నాగయ్య టెంపుల్‌ ఏరియా, అబ్బని కుంట ప్రాంతాల్లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఖిలా వరంగల్‌ కోటలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో మోటు పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా స్పాంజ్‌ పార్క్‌, రాతి కోట చుట్టూ రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌, కార్పొరేటర్లు పల్లం పద్మ, రవి, పోశాల పద్మస్వామి, భోగి సువర్ణ సురేష్‌, ఉమ, దామోదర్‌ యాదవ్‌, సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్‌, తహసిల్దార్ మహ్మద్‌ ఇక్బాల్‌, డీఈ రంగారావు, బోయిని దూడయ్య, గజ్జల శ్యామ్‌, భైరబోయిన రవి, పోశాల సారంగపాణి, సంగరబోయిన చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img