కాకతీయ, ధర్మసాగర్: మండల స్థాయి కళా ఉత్సవం 9న మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని టీచింగ్ లెర్నింగ్ సెంటర్ భవనంలో ఉదయం 9:30 గంటల నుండి నిర్వహించునున్నారు. మండలంలోని అన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, కస్తూరిబా గాంధీ విద్యాలయం, ప్రైవేటు పాఠశాలల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 9 నుండి 12వ తరగతి విద్యార్థులు ఈ కళా ఉత్సవంలో పాల్గొనుటకు అర్హులని ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రాంధన్ తెలిపారు.
మ్యూజిక్ సోలో, గ్రూప్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ సోలో, గ్రూప్ నృత్యం సోలో గ్రూప్ , విజువల్ ఆర్ట్స్ సోలో గ్రూప్, కథలు చెప్పడం సాంప్రదాయక కథలు చెప్పడం అను అంశాలలో పోటీలు నిర్వహించి, ఉత్తమమైన వాటిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు. మండలంలోని విద్యార్థులకు చదరంగం పోటీలు ఇదే ప్రాంగణంలోని సెమినార్ హాల్లో నిర్వహిస్తారని చెస్ పోటీల నిర్వహణ బాధ్యులు, అయిత శ్రీనివాస్ తెలిపారు.


