కాకతీయ, హనుమకొండ : మున్నూరు కాపు సంఘం సమావేశం ఆదివారం మధ్యాహ్నం ములుగు రోడ్డులోని వజ్రా గార్డెన్‌లో నిర్వహిస్తారని సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్ తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తంరావు పటేల్, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ మీసాల చంద్రయ్య పటేల్, అపెక్స్ కౌన్సిల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సుంకరి బాలకిషన్ రావు పటేల్, డైరీ కమిటీ చైర్మన్, రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్ పటేల్ తో పాటు రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా విభాగం, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కనుకుంట్ల రవికుమార్ పిలుపునిచ్చారు.


