కాకతీయ రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న ముల్కనూరి శ్రీనివాస్ శుక్రవారం ఉత్తమ తహసిల్దారు అవార్డు అందుకున్నారు.79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా తహసిల్దారు శ్రీనివాస్ ప్రశంస పత్రం స్వీకరించారు. ఈ నేపథ్యంలో మండల వివిధ శాఖల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఉత్తమ తహసిల్దారుగా ముల్కనూరి శ్రీనివాస్‌కు అవార్డు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


