ముత్యాలమ్మ జాతరకు ముహూర్తం
ఫిబ్రవరి 11న బోనాల పండుగ నిర్వహణ
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం మండలంలోని చిన్న నాగారం శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో జరిగే అమ్మవారి జాతరకు ఫిబ్రవరి 11న బోనాల పండుగ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం వాస్తు–జ్యోతిష పండితులు పోలోజు పూర్ణాచారి, వెంకన్న చారి గ్రామస్తుల సమక్షంలో ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా నిర్ణయించిన ముహూర్తానికి సంబంధించిన పత్రాన్ని సర్పంచి చెడుపాక సుజాత భర్త యాకయ్య, సీనియర్ గౌడ సంగం నేత బైరు వెంకటయ్య గౌడ్‌తో పాటు ఇతర ప్రముఖులకు అందజేశారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సమన్వయంతో ముందుకు సాగాలని పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి, వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, బైరు వినయ్ గౌడ్, వై. శ్రీనుయాదవ్, నాయకులు బైరు అశోక్ గౌడ్, మునిగంటి రాజు చారి, కొయ్యడియాకాంతం గౌడ్, బైరు పటేల్ కొమురయ్య గౌడ్, పంజాల వాసుదేవ గౌడ్, భైరు శ్రీనివాసు గౌడ్, గుండాల ధర్మయ్య, దాసరి ప్రకాష్, చెడుపాక దర్గయ్య తదితరులతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


