ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు
వరంగల్ తూర్పులో సేవా కార్యక్రమాలు
పోచమ్మమైదాన్ జంక్షన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు
300 మందికి అన్నదానం, పండ్ల పంపిణీ
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
కాకతీయ, వరంగల్ సిటీ : బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని పోచమ్మమైదాన్ జంక్షన్‌లో వీఆర్‌సీ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జన్మదినాన్ని ప్రజలతో కలిసి జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా భారీ కేక్‌ను కట్ చేసి సుమారు 300 మందికి పండ్లు, అన్నదానం చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. యువత భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంపీ జన్మదినాన్ని కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సామాజిక సేవతో ముడిపెట్టి నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నదానం కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవా భావనతో పనిచేయాలన్న సందేశాన్ని ఈ సందర్భంగా యూత్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్‌కుమార్, వీఆర్‌సీ యూత్ సభ్యులు ఏరుకొండ వినయ్, ఎండి షారుక్ ఖాన్, సిరిమల్లె కిరణ్, నానవరపు సందీప్, రవ్వల ప్రభాకర్, చోటు, మహేష్, మురళి, నాగపురి రమేష్, అల్లపు సాయి తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
అంతకుముందు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని రవిచంద్ర యూత్ వింగ్ సభ్యులు ఉదయం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రవిచంద్ర గోత్రనామాలతో అర్చనలు చేసి అమ్మవారి ఆశీస్సులు కోరారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. జన్మదిన వేడుకలు ఆధ్యాత్మికత, సేవా భావనతో సమన్వయంగా సాగడం విశేషంగా నిలిచింది.


