వేలాల గట్టు మల్లన్నకు ఎంపీ ప్రత్యేక పూజలు
ఆలయ అభివృద్ధికి సహకారం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ చెన్నూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయంలో భక్తులతో కలిసి నామస్మరణ చేస్తూ ఎంపీ దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎంపీ వంశీకృష్ణ స్వామివారి ఆలయంలో భక్తులతో కలిసి నామస్మరణలో పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీ రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.
ఆలయ అభివృద్ధికి హామీ
అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తదుపరి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు.


