ఆయకట్టును స్థిరీకరించాలని మంత్రి ఉత్తమ్ కు ఎంపీ చామల వినతి
రైతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
* ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాకతీయ,చేర్యాల: సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వేయర్ నుంచి డి10 కెనాల్ నుంచి జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వేయర్ డి3 కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టును స్థిరీకరణ చేసి దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్ పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్,దూల్మిట్ట గ్రామాల పరిధిలోని సుమారు 7 వేల ఎకరాలకు రంగనాయక సాగర్ డి10 కెనాల్ కింద స్థిరీకరించాలని *నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకరం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో కూడా అక్కడి రైతుల సమస్యను ఎంపీ దృష్టికి తీసుకురాగా కాల్వలను పరిశీలించి రైతులతో మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రైతుల అవసరాల నిమిత్తం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కలిసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వినతి పత్రం సమర్పించిన తక్షణమే సానుకూలంగా స్పందించిన మంత్రి టెంపర్వరి జీవోను అమలు చేసి రైతులకు సాగునిరు అందించారు. రాబోయే శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకొని బుధవారం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి చెరువులలోనికి నీటిని విడుదలచేసి రైతన్నలకు సాగునీరు అందించాలని కోరారు. అలాగే గతంలో ఇచ్చిన టెంపర్వరి జీవో కాకుండా పర్మినెంట్ జీవో ఇవ్వాలని మంత్రిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని అయన వివరించారు.ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతన్నలకు అండగా ఉంటామని ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు.


