విదేశాల్లో ఉంటూ సినిమా పైరసీలు
ముఠాను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
కాకతీయ, సినిమా డెస్క్ : సినిమాలను పైరసీ చేస్తున్న కేటుగాళ్ల పనిబట్టార హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.గతంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టి నిందితుడిని జులై 3న వనస్థలిపురంనకు చెందిన కిరణ్‌ను అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, ఆ పైరసీ ముఠా సభ్యులు దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్లు గుర్తించారు. పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ టూల్స్‌తోపాటు ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ సినిమాలను రికార్డ్ చేసి, టెలిగ్రామ్, టోరోంటో వంటి మాద్యమాల ద్వారా అమ్మకాలు జరుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.థియేటర్‌లో ప్రదర్శితమయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డులను క్రాక్ చేస్తున్నట్లు తేలింది. అదేవిధంగా ఏజెంట్ల ద్వారా అంగి జేబుల్లో, పాప్‌కార్న్ డబ్బా, కోక్ టిన్‌లలో కెమెరాలు పెట్టి సినిమాలను రికార్డు చేస్తున్నారు. అలా చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు విక్రయిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్లు అందిస్తున్నారు.


