కాకతీయ, బిజినెస్ డెస్క్: మోటోరోలా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. మోటో జీ06 పవర్ పేరుతో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్ కలిపి, వినియోగదారులకు స్మూత్, వేగవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌లో 6.88 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. ఇది 20.5:9 యాస్పెక్ట్ రేషియో, 395 ppi, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లతో వస్తుంది. అదనంగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది. కాబట్టి స్క్రీన్ సేఫ్టీపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
పవర్ ఫుల్ ప్రాసెసింగ్ కోసం, మోటో జీ06 పవర్ మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. 8 జీబీ ర్యామ్ ఉన్న ఈ ఫోన్, ఏ గేమ్ ఆడినా లేదా మల్టీటాస్కింగ్ చేసినా ఎలాంటి ల్యాగ్ లేకుండా పని చేస్తుంది. స్టోరేజీ పరంగా, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీతో వస్తుంది. కానీ అవసరమైతే 1 టెరాబైట్ వరకూ మైక్రోఎస్‌డీ ద్వారా ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.
కెమెరా విభాగంలో, రియర్‌లో 50MP ఎఫ్/1.8 ప్రైమరీ కెమెరా ఉంది. ఇది 4కె వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్‌లో 8MP ఎఫ్/2.05 కెమెరా ఉంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అనుకూలంగా ఉంటుంది. ఫోన్‌లో 7,000 mAh శక్తివంతమైన బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల, లాంగ్-లాస్టింగ్ బ్యాటరీని వేగంగా రీఛార్జ్ చేయవచ్చు. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా అందిస్తుంది.
సాఫ్ట్‌వేర్ పరంగా, మోటో జీ06 పవర్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UIతో పనిచేస్తుంది. అదనంగా, Wi-Fi, బ్లూటూత్ 6.0, GPS, USB-C, డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్టీరియో స్పీకర్లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి సౌకర్యాలు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అత్యాధునిక ఫీచర్లను అందించే ఫోన్ కావాలనుకుంటే, మోటో జీ06 పవర్ ఒక గొప్ప ఎంపిక. లీక్స్ ప్రకారం, దీని ధర సుమారు రూ.13,500 ఉంటుంది. ఇది ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం, ప్రాసెసర్ శక్తిని పరిగణనలోకి తీసుకుంటే మంచి వ్యాల్యూ ఫర్ మనీ ఆఫర్‌గా చెప్పవచ్చు.


