
కాకతీయ, గీసుగొండ: తల్లి కూతుర్లు అదృశ్యమైన ఘటన వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్లలో చోటు చేసుకుంది. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం…రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ జిల్లా సిక్రి గ్రామానికి చెందిన షాహిద్ ఖాన్ జీవనోపాధి కోసంవలస వచ్చి మొగిలిచర్లలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో షాహిద్ ఖాన్ భార్య సెహరున్(31)తన ఇద్దరు కుమార్తెలు సహిస్తా(9), సానియా(6)లతో కలిసి తేదీ 27/10/2025 ఉదయం నుండి కనిపించడం లేదని భర్త షాహిద్ ఖాన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


