మహనీయుల స్మృతితో మార్నింగ్ వాక్
టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్
కాకతీయ, పెద్దవంగర : మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ చేసే మార్నింగ్ వాక్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, మనసుకు గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుందని టిఫిటిఎఫ్ మండల అధ్యక్షులు చిక్కల సతీష్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ లు అన్నారు. దేశ ప్రజల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి కృషి చేసి, భారత దేశంలో అణగారిన వర్గాలకు వెలుగు దివిటీలుగా నిలిచిన మహనీయులు ఎందరో ఉన్నారని వారిలో మహాత్మా జ్యోతిబా పూలే, డా. బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రాం లాంటి వారు ముఖ్యులని,ఈ ముగ్గురు ఏప్రిల్ నెలలోనే జన్మించారు. మహనీయులకు జన్మనిచ్చిన మాసంగా ఏప్రిల్ నెలను భావిస్తున్నామని,ఈ సందర్భంగా ఆ ముగ్గురిని స్మరిస్తూ టీపీటీఎఫ్ పెద్దవంగర మండల శాఖ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు, ఉపాధ్యాయులు,పాత్రికేయులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులందరు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఉదయం 6 గంటలకు పాత పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలని కోరారు.


