ప్రివెంటివ్ పోలీసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి
ఇంతజారుగంజ్ స్టేషన్ వార్షిక తనిఖీలో డీసీపీ దార కవిత
కాకతీయ, వరంగల్ ప్రతినిధి :నేరాల నియంత్రణలో భాగంగా ప్రివెంటివ్ పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఐపీఎస్ సూచించారు. సోమవారం ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె వార్షిక తనిఖీ నిర్వహించారు. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన వివిధ కేసుల వివరాలను పరిశీలించిన డీసీపీ, దర్యాప్తులు, విచారణలు, కేసుల పరిష్కారాల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. స్టేషన్ అధికారుల పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
రౌడీలు, సస్పెక్టులపై నిఘా
స్టేషన్ పరిధిలోని రౌడీలు, కేడీలు, డీసీలు, సస్పెక్టుల ప్రవర్తనపై డీసీపీ వివరాలు తెలుసుకున్నారు. నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇన్స్పెక్టర్ షుకూర్, సబ్‌ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో సమావేశమైన డీసీపీ దార కవిత, నేర నిరోధక చర్యలపై మరింత ఫోకస్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని సూచించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని డీసీపీ హామీ ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఏఎస్పీ శుభం నగరాలే, ఇన్స్పెక్టర్ షుకూర్, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


