కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ మండల తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఇక్బాల్, ఖిలా వరంగల్ మండలానికి బదిలీ అయ్యారు. అధికారుల ఆదేశాల మేరకు ఖిలా వరంగల్ తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఖిలా వరంగల్ ఇంచార్జి తహశీల్దార్ శ్రీకాంత్ వరంగల్ మండలం తహశీల్దార్ గా బదిలీ అయ్యారు.
ఖిలా వరంగల్ మండల పరిధిలో ఓరుగల్లు రాజధాని భూములు, మామునూరు ఎయిర్పోర్ట్ భూములు, మరియు జక్కులుద్ది ఏరియాలో వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి వున్నది. ప్రభుత్వ భూములు అధికంగా ఉండటంతో మండల తహసిల్దార్ కు రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంటుందని, అందుకనే ఈ మండలం కి వచ్చిన యే తహసిల్దార్ అయినా తొందరగా ట్రాన్స్ఫర్ అవ్వడమో లేక ఎక్కువ కాలం పని చేసిన తహసిల్దార్ ఏసీబీ ట్రాప్ లో పడడమో జరుగుతుందని మండలంలో చర్చ జరుగుతుంది.
ఇప్పటికైనా కొత్త తహసిల్దార్ సమర్థవంతంగా ఇక్కడి సమస్యలు తీర్చాలని ప్రభుత్వ భూములను కాపాడాలని, రైతు భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని మండల రైతులు కోరుకుంటున్నారు.


