కాకతీయ, హనుమకొండ : 1946లో వరంగల్ తూర్పు కోటలో నిజాం నిషేధాన్ని తుంగలో తొక్కి జాతీయ జెండాను ఎగురవేసిన మొగిలయ్య గౌడ్, రజాకార్ల దాడిలో అమరులయ్యారు. వరంగల్‌లోని మొగిలయ్య హాల్‌లో మొగిలయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మొగిలయ్య జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. వరంగల్‌లో మొగిలయ్య గౌడ్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం.. త్వరలోనే మొగిలయ్య విగ్రహం ఏర్పాటు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


